
Learn The Importance of Malachi
మలాకీ గ్రంధము యొక్క ప్రాముఖ్యత ఏంటి?
మలాకీ గ్రంధము పాత నిబంధన గ్రంధాలలో ఆఖరి గ్రంధము.
ఈ గ్రంధము తరవాత సుమారు 400 సంవత్సరాలు దేవుని నుంచి వీరికి వాగ్దానము కానీ, ప్రవచనము కానీ ఏమి రాలేదు.
అందుకే ఈ కాలాన్ని, నిశ్శబ్ద కాలము అని అంటారు.
హగ్గయి మరియు జెకర్యా గ్రంధాలలో యెహోవా దేవుని ఆలయము, దాని ప్రాముఖ్యత, అదేవిధంగా, ఆలయములో ఈ యూదులు దేవుని ఆరాధించాలి అంటే, వారి జీవిత విధానము మంచిగా ఉండాలి అని నేర్చుకున్నాం.
మలాకీ గ్రంధములో కూడా ప్రాముఖ్యమైన అంశము – దేవుని ఆరాధించుట.
అనేక అంశాలు గురించి ఈ గ్రంధం మాట్లాడతుంది. కానీ ప్రాముఖ్యమైనది – దేవుని ఆరాధించుట.
కానీ ఈ చెరలోనుండి బయటకు వోచిన ఈ యూదులు దేవుణ్ణి ఆరాధించాలి అంటే, వారు మారుమనస్సు కలిగి ఉండాలి.
జెకర్యా మరియు హగ్గయి ప్రవచనాలు చేసిన, వారు ప్రవచించిన సమయములో దేవుని ఆలయ నిర్మాణము పూర్తయిన, ఈ ప్రవక్తల కాలం ముగియగానే, ఈ యూదులు మరల వారి పాత జీవితానికి అలవాటు పడ్డారు.
దేవుని ఆలయము చక్కగా ఉంది, దేవుని మీరు ఆరాధించాలి.
కానీ, మీ జీవితాలు బాగోలేదు, మీ మనస్సులు మారాలి, మీరు పశ్చాత్తాపపడి, మారుమనస్సు కలిగి జీవించాలి, అప్పుడే మీరు దేవుని మీ పూర్ణ హృదయముతో ఆరాధించగలరు అందేది ఈ గ్రంథ వర్తమానము.